ఎన్నికల టైములో రాజకీయాలు మాట్లాడుకోవాలి.. ఆ తర్వాత ప్రజా సమస్యలపైనే దృష్టి పెట్టాలి – పవన్

ఎన్నికల సమయంలోనే రాజకీయాలు మాట్లాడుకోవాలని, ఎన్నికల తర్వాత ప్రజా సమస్యలపైనే దృష్టి పెట్టాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. ఆదివారం భీమవరం లో ‘జనసేన జనవాణి’ కార్యక్రమం నిర్వహించిన పవన్..ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాల ప్రజల నుంచి అర్జీల స్వీకరించారు.

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ..ఎన్నికల సమయంలోనే రాజకీయాలు మాట్లాడుకోవాలని, ఎన్నికల తర్వాత ప్రజా సమస్యలపైనే దృష్టి పెట్టాలని సూచించారు. కానీ ప్రస్తుతం అలా జరగడంలేదన్నారు. అందుకే ప్రజాసమస్యల పరిష్కారం కోసం జనసేన జనవాణి కార్యక్రమం చేపట్టిందని చెప్పుకొచ్చారు. జనసేన పార్టీ ప్రభుత్వంపై వరుస బాణాలు ఎక్కుపెడుతోంది. నిత్యం జనంలో ఉండాలనే లక్ష్యంతో ఎప్పటికప్పుడు కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడుతుందని తెలిపారు. జనసేన చేపడుతున్న కార్యక్రమాల ద్వారా ప్రభుత్వంలో చలనం వస్తుందని అన్నారు. ఈరోజు ఉదయం పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో ఇటీవల ప్రధానమంత్రి చేతుల మీదుగా ఆవిష్కృతమైన విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు 30 అడుగుల కాంస్య విగ్రహానికి పవన్ కళ్యాణ్ నివాళులర్పించారు.

ఇక నిన్న శనివారం మండపేట లో పవన్ కళ్యాణ్ పర్యటించారు. ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతు కుటుంబాలకు ఆర్థికసాయం అందజేశారు. అనంతరం భారీ బహిరంగ సభలో పాల్గొన్నారు.