మేడ్చల్ లో దారుణం : ప్రేమించలేదని యువతీ ఇంటిని తగలబెట్టిన ప్రేమికుడు

ఒకప్పుడు ప్రేమించకపోతే యాసిడ్ పోస్తానని , లేదా చేయి కోసుకుంటానని బెదిరించే వారు..కానీ ఇప్పుడు ట్రెండ్ మార్చారు. ప్రేమించకపోతే చనిపోవడం , చంపడం చేయకుండా , ప్రేమించిన యువతీ ఇంటిని కాల్చేస్తూ ..వారి కుటుంబాన్ని రోడ్డుపైకి లాగుతున్నారు. ఆమధ్య నెల్లూరులో ఒక ప్రేమోన్మాది ప్రియురాలి ఇల్లు తగలబెట్టాడు. తనను ప్రేమించలేదన్న కసితో ప్రేయసిని.. ఆమె కుటుంబాన్ని కూడా రోడ్డుపైకి లాగాడు. తాజాగా.. మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇలాంటి ఘటనే జరిగింది.

మద్యం , గంజాయికి అలవాటు పడ్డ నవీన్ అనే యువకుడు..ఓ యువతిని ప్రేమిస్తునాన్ని చెప్పి ఆమె వెంట పడడం మొదలుపెట్టాడు. ఆమె నవీన్ ప్రేమను తిరస్కరించడం తో కోపం పెంచుకున్న అతడు..ఫుల్ గా మద్యం తాగిన నవీన్, యువతి ఇంట్లో ఎవరూ లేని విషయం తెలుసుకుని.. అక్కడికి వెళ్లి పెట్రోల్ పోసి నిప్పు పెట్టాడు. ఇల్లు మొత్తం కాలిపోయింది. వస్తువులు, నగలు బూడిదయ్యాయి. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. ఈ ఘటన ఇప్పుడు మేడ్చల్ లో సంచలనంగా మారింది. శాడిస్ట్ నవీన్ ని పోలీసులు అరెస్ట్ చేసి జైలుకి తరలించారు.