పెండింగ్ చలాన్లు కట్టలేక నడి రోడ్డు ఫై బైక్ ను కాల్చేశాడు

పెండింగ్ చలాన్లు కట్టలేక నడి రోడ్డు ఫై బైక్ ను కాల్చేశాడు

వాహనం తీసుకొని రోడ్డు ఎక్కాలంటే వాహనదారులు వణికిపోతున్నారు. లీటర్ పెట్రోల్ వంద దాటింది..మరో పక్క ట్రాఫిక్ రూల్స్ పాటించకపోతే చలాన్ వేస్తున్నారు. దీంతో వాహనదారులు భయపడుతూ నడుపుతున్నారు. ఈ క్రమంలో ఓ వాహనదారుడుని పెండింగ్ చలాన్ కట్టాలంటూ నడి రోడ్డు ఫై పోలీసులు ఆపడం తో కోపం తో సదరు వ్యక్తి తన బైక్ ను తగలపెట్టాడు. ఈ ఘటన ఆదిలాబాద్‌ జిల్లాలో చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే ,..

ఆదిలాబాద్‌ జిల్లా ఖానాపూర్‌కు చెందిన మక్బూల్ అనే వ్యక్తి తన వాహనంపై ఉన్న రెండు వేల రూపాయల జరిమానా చెల్లించానని.. ఇంకా చెల్లించాలంటూ పోలీసులు ఇబ్బందిని పెడుతున్నారని ఆవేదన తో..చలాన్ల భారం భరించలేక పంజాబ్ చౌక్‌లో తన వాహనాన్ని తగులబెట్టాడు. ఈ క్రమంలోనే పోలీసులు, స్థానికులు మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. అప్పటికే బైక్ చాలా భాగం కాలిపోయింది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.