ఒమిక్రాన్ కలవరం..ప్రపంచ వాణిజ్య సంస్థ సదస్సు వాయిదా
WTO’s big conference postponed due to new Covid variant
జెనీవా: ప్రపంచ వాణిజ్య సంస్థ ఆధ్వర్యంలో వచ్చే వారం జరగాల్సిన మంత్రిమండలి సమావేశం వాయిదా పడింది. కోవిడ్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ దడపుట్టిస్తున్న నేపత్యంలో ఆ సమావేశాలను వాయిదా వేశారు. నిజానికి నాలుగు రోజుల పాటు జరిగే కాన్ఫరెన్స్‌కు జెనీవా సన్నద్దమవుతోంది. కానీ చివరి నిమిషంలో ఒమిక్రాన్ భయం వల్ల ఆ మీటింగ్‌ను రద్దు చేశారు. డబ్ల్యూటీవో డైరక్టర్ జనరల్ నోజి ఒకన్జో వియేలా ప్రస్తుత సమావేశాల్లో కోవిడ్ టీకా పేటెంట్ అంశాలను చర్చించాలనుకున్నారు.
ఒమిక్రాన్ ఆందోళనకరమైన వేరియంట్ అని డబ్ల్యూహెచ్‌వో ప్రకటించిన నేపథ్యంలో.. దక్షిణాఫ్రికా నుంచి వస్తున్న విమానాలను కొన్ని దేశాలు రద్దు చేశాయి. మొత్తం 164 సబ్యదేశాలకు చెందిన ప్రతినిధులు ఈ భేటీకి హాజరుకావాల్సి ఉంది. వాయిదా వేయాలన్న పిలుపుకు సభ్యదేశాలు ఏకగ్రీవంగా అంగీకరించాయి.
తాజా బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/business/