ఏపీలో వరదలు ..పరిశీలనకు వచ్చిన కేంద్ర బృందం

తిరుపతి రాయల చెరువును పరిశీలించిన కేంద్ర బృందం

చిత్తూరు: ఏపీలో వరద పరిస్థితులను అంచనా వేయడానికి రాష్ట్రానికి వచ్చిన కేంద్ర బృందం నేడు చిత్తూరు జిల్లాలో పర్యటించింది. తిరుపతి సమీపంలోని రాయల చెరువును పరిశీలించింది. కేంద్ర బృందానికి రాయల చెరువు పరిస్థితిని జిల్లా కలెక్టర్ ఎం.హరినారాయణన్, వైస్సార్సీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వివరించారు.

కాగా, కేంద్ర బృందం తమ పర్యటనలో భాగంగా చిత్తూరు జిల్లాలోని గంగవరం మండలం మామడుగు గ్రామంలో జరిగిన పంటనష్టాన్ని పరిశీలించింది. ఇక్కడ కనికల్ల చెరువు ఆయకట్టు కింద 172 ఎకరాల్లో వరి సాగు జరుగుతోంది. ఇటీవల కురిసిన భారీ వర్షాలతో పంట తీవ్రంగా దెబ్బతిన్నది. ఈ సందర్భంగా తమ గ్రామానికి వచ్చిన కేంద్ర బృందం సభ్యులకు గ్రామస్తులు తమకు జరిగిన నష్టాన్ని వివరించారు. తమను ఆదుకోవాలని కోరారు. అటు, చంద్రగిరి మండలం కాశీపెంట, పెదపంజాణి మండలంలోనూ కేంద్ర బృందం పర్యటించింది.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/international-news/