175 రోజులు పూర్తి చేసుకున్న అఖండ ..ఏ థియేటర్ లో తెలుసా..?

నందమూరి బాలకృష్ణ – బోయపాటి శ్రీను కలయికలో వచ్చిన హ్యాట్రిక్ మూవీ అఖండ 175 రోజులు పూర్తి చేసుకుంది. కరోనా సెకండ్ లాక్ డౌన్ తర్వాత ఎన్నో అనుమానాల మధ్య రిలీజ్ అయి భారీ విజయం సాధించింది. బాలయ్య మాస్ సీక్వెన్స్, తమన్ అదిరిపోయే BGM, బోయపాటి టేకింగ్, హిందూ ధర్మాలు, హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడుల గురించి చెప్పిన విధానం.. ఇవన్నికలిపి ఈ సినిమాని భారీ విజయం సాధించేలా చేసాయి.

మన దేశంలోనే కాక ఓవర్సీస్ లో కూడా అఖండ సినిమా దుమ్ము దులిపేసింది. బాలయ్య కెరీర్ లోనే మొట్టమొదటి 100 కోట్ల సినిమాగా రికార్డు సృష్టించింది అఖండ. ఈ రోజుల్లో ఒక సినిమా వారం ఆడటమే గగనం. అలాంటిది ఈ సినిమా ఇప్పటికే 50 రోజుల వేడుక, 100 రోజుల వేడుకని జరుపుకొని వార్తల్లో నిలువగా..ఇక ఇప్పుడు ఏకంగా 175 రోజులు సింగిల్ థియేటర్లో కంటిన్యూగా ఆడి సరికొత్త రికార్డ్ సృష్టించింది.

ఈ సినిమా 50వ రోజు 103 థియేటర్స్‌లో ప్రదర్శించ బడటం ఒక రికార్డు అని చెప్పాలి. అది ఓ రికార్డు అనుకుంటే.. ఆ తర్వాత సెంచరీ పూర్తి చేసుకొని హిస్టరీ రిపీట్ చేసింది. ఈ సినిమా 20 థియేటర్స్‌లో 100 రోజుల పూర్తి చేసుకుంది. అందులో 4 కేంద్రాల్లో డైరెక్ట్‌గా 100 రోజులు ఆడింది. తాజాగా ఈ సినిమా 175 రోజులు పరుగును పూర్తి చేసుకుంది. అది కూడా గుంటూరు జిల్లా చిలకలూరి పేటలోని రామకృష్ణ థియేటర్‌లో ఈ సినిమా విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. బాలయ్య సినిమాలకు తెలంగాణ, ఏపీల కంటే సీడెడ్ (రాయలసీమ)లో తిరుగులేని ఫ్యాన్ బేస్ ఉంది. బాలయ్య చిత్రాలకు ఎక్కువ వసూళ్లు ఈ ఏరియాల్లోంచే వస్తుంటాయి. ఈ ఏరియాలోని బాలయ్య సినిమాలకు ఎక్కువ రెవెన్యూ వస్తూ ఉంటాయి. ఇక బాలయ్య, బోయపాటి శ్రీను కాంబోలో వచ్చిన రెండో సినిమా ‘లెజెండ్’ సినిమా కడప, కర్నూలు జిల్లా సెంటర్స్‌లో 400 రోజులు పైగా ఆడింది. కడపలో ఓ సెంటర్‌లో 1000 రోజులు పైగా ప్రదర్శించబడింది. సౌత్ సినీ ఇండస్ట్రీలో ఏ హీరోకు ఈ రికార్డు లేదు. బాలయ్య ‘అఖండ’ సినిమా ఎమ్మిగనూరులో 100 రోజులు పూర్తి చేసుకోనుంది. ఈ సెంటర్లో బాలయ్య సినిమాలు ఏకంగా 11 సినిమాలు డైరెక్ట్‌గా 4 షోలతో కంటిన్యూ 100 రోజులుగా పైగా ఆడి రికార్డు క్రియేట్ చేశాయి.