నేడు గెహ్లాట్, సచిన్ పైలట్ లతో మల్లికార్జున ఖర్గే సమావేశం

ఇద్దరి మధ్య సయోధ్యను కుదిర్చేందుకు సమావేశం నిర్వహిస్తున్న ఖర్గే

mallikarjun-kharge-meeting-with-ashok-gehlot-and-sachin-pilot

న్యూఢిల్లీః సిఎం అశోక్ గెహ్లాట్, కీలక నేత సచిన్ పైలట్ ల మధ్య నెలకొన్న ఆధిపత్య పోరుతో రాజస్థాన్ కాంగ్రెస్ సతమతమవుతోంది. ఈ క్రమంలో ఇద్దరి మధ్య సయోధ్యను కుదిర్చేందుకు కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే సిద్ధమయ్యారు. గెహ్లాట్, సచిన్ పైలట్ లతో ఈరోజు ఖర్గే సమావేశమవుతున్నారు. తను మూడు డిమాండ్లను ఈ నెలఖరులోగా నెరవేర్చకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలను చేపడతానని సచిన్ పైట్ హెచ్చరించిన నేపథ్యంలో జరుగుతున్న ఈ సమావేశం ప్రాధాన్యతను సంతరించుకుంది.

గత వసుంధరా రాజే ప్రభుత్వంలో చోటు చేసుకున్న కుంభకోణాలపై ఉన్నత స్థాయి విచారణ జరిపించాలనేది పైలట్ మూడు డిమాండ్లలో ఒకటి. ఈ ఏడాది చివర్లో రాజస్థాన్ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఇరువురి మధ్య సయోధ్య కుదిర్చేందుకు కాంగ్రెస్ హైకమాండ్ ప్రయత్నాలను మొదలుపెట్టింది. కర్ణాటకలో సిద్ధరామయ్య, డీకే శివకుమార్ ల మధ్య సయోధ్యను కుదిర్చిన ఫార్ములానే ఇక్కడ కూడా అమలు చేయాలని భావిస్తోంది.