‘మళ్ళీ పెళ్లి ‘ నుండి రొమాంటిక్‌ సాంగ్‌ విడుదల..

సీనియర్ హీరో నరేష్ నుండి వస్తున్న సినిమా మళ్ళీ పెళ్లి. పవిత్ర లోకేష్‌తో కలిసి గత కొంతకాలంగా నరేష్ సహజీవనం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఈ ఇద్దరూ కలిసి మళ్ళీ పెళ్లి అంటూ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ నెల 26న తెలుగు, కన్నడ భాషల్లో ఈ మూవీ రిలీజ్ కాబోతుంది. ఈ క్రమంలో ఈ సినిమా నుండి రొమాంటిక్ సాంగ్ రిలీజ్ చేసారు. ఈ సాంగ్‌ లో రొమాంటిక్‌ సీన్స్‌ బాగున్నాయి.

విజయ కృష్ణ మూవీస్ బ్యానర్‌పై తెలుగు, కన్నడ భాషల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాకు నరేష్ స్వయంగా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి 50 ఏళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా ఈ సినిమాను రూపొందిస్తున్నారట. ఈ చిత్రానికి ప్రముఖ నిర్మాత ఎంఎస్ రాజు దర్శకత్వం వహిస్తుండటం మరో విశేషం. సురేష్ బొమ్మిలి సంగీతం అందిస్తున్నారు.

YouTube video