బండి సంజయ్ వ్యాఖ్యలను ఖండించిన కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బిజెపి లో చేరబోతున్నట్లు దాదాపు ఖరారైనట్లే..ఈ తరుణంలో రాజగోపాల్ సోదరుడు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సైతం బిజెపి తో టచ్ లో ఉన్నారంటూ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కామెంట్స్ చేయడం రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ అయ్యింది, బండి సంజయే ఆ మాట అనడం తో నిజగంగానే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కూడా బిజెపి లో చేరబోతున్నారని అంత మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. ఈ తరుణంలో కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి..బండి సంజయ్ వ్యాఖ్యలను ఖండించారు.

సంజయ్‌తో ఎప్పుడూ టచ్‌లో లేనని స్పష్టం చేశారు. మునుగోడు ఉప ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తుందని బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై స్పందించేందుకు నిరాకరించారు. ఎమ్మెల్యే పదవికి రాజగోపాల్‌రెడ్డి ఇంకా రాజీనామా చేయలేదని.. రాజీనామా చేశాక, దాన్ని స్పీకర్ ఆమోదించాక మాత్రమే ఈ విషయంపై స్పందిస్తానన్నారు. రాజగోపాల్‌రెడ్డి రాజీనామా చేయకముందే ఉపఎన్నిక గురించి మాట్లాడటం మంచి పద్ధతి కాదన్నారు. రాజగోపాల్‌రెడ్డి రాజీనామా పొందిన తర్వాత తాను ఏం చేయాలో నిర్ణయం తీసుకుని ప్రకటిస్తానని వెంకట్‌రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీని కలిసిన ఉద్దేశ్యం గురించి కూడా కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి క్లారిటీ ఇచ్చారు. తన నియోజకవర్గంలో జాతీయ రహదారుల అంశంతో పాటు బొగ్గు గనుల టెండర్ల విషయంలో చోటు చేసుకొన్న అవినీతి విషయంలో ప్రధానిని కలిసినట్టుగా క్లారిటీ ఇచ్చారు.