కరోనా నివారణకు అందరం కలిసి పోరాడాలి

రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కమార్

minister-puvvada-ajay-kumar

ఖమ్మం: రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కమార్ ఖమ్మం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు అధ్యక్షతన ఏర్పాటు చేసిన సర్వసభ్య సమావేశానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు… ప్రస్తుతం మనం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య కరోనా వైరస్ అని.. దాని నివారణ కోసం అందరం కలిసికట్టుగా పోరాడాలని పువ్వాడ అన్నారు. కరోనాను నిలువరించేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. విధిగా ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించి, భౌతిక దూరం పాటించాలన్నారు. వైరస్ కట్టడిలో ముఖ్య పాత్ర పోషిస్తున్న కలెక్టర్ కర్ణన్, జిల్లా యంత్రాంగాన్ని మంత్రి ఈ సందర్భంగా అభినందించారు. అలాగే వానకాలం పంటలు, ఎరువులు, విత్తనాల లభ్యత, రైతుబంధు వేదికల నిర్మాణం తదితర అంశాలపై అధికారులకు పలు సూచనలు చేశారు.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/