యుద్ధానికి సిద్ధంకండి…జిన్‌పింగ్‌!

సైనిక దళాలకు చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ పిలుపు

Xi Jinping

బీజింగ్‌: చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ ద‌క్షిణ ప్రావిన్సు గాంగ్‌డాంగ్‌లో ఉన్న ఓ మిలిట‌రీ బేస్‌ను ఆయ‌న మంగ‌ళ‌వారం విజిట్ చేశారు. ఈ నేప‌థ్యంలో సైనిక బ‌ల‌గాల‌తో మాట్లాడుతూ.. మీకున్న శక్తియుక్తులన్నింటినీ యుద్ధంపైనే నిమగ్నం చేయండని చైనా ఆర్మీతో జిన్‌పింగ్‌ చెప్పినట్టుగా తెలుస్తుంది. స‌మ‌ర భేరికి సిద్ధంగా ఉండాలంటూ త‌మ దేశ బ‌ల‌గాల‌కు పిలుపునిచ్చారు. త‌మ శ‌క్తిని, యుక్తిని యుద్ధంపై కేంద్రీక‌రించే విధంగా ఉండాల‌న్నారు. చాజూ సిటీలో ఉన్న పీపుల్స్ లిబ‌రేష‌న్ ఆర్మీ మెరైన్ కార్ప్స్ ద‌ళాల‌ను అధ్య‌క్షుడు జీ జిన్‌పింగ్ త‌నిఖీ చేశారు. ఎప్ప‌డూ హై అల‌ర్ట్‌లో ఉండాలంటూ ఆయ‌న సైనికుల‌కు ఉప‌దేశించారు. సైనికులెప్పుడూ నిత్యం విశ్వ‌స‌నీయంగా, స్వ‌చ్ఛంగా, న‌మ్మ‌కంగా ఉండాల‌న్నారు. షెన్‌జెన్ స్పెష‌ల్ ఎకాన‌మిక్ జోన్ 40వ వార్షికోత్స‌వం సంద‌ర్భంగా ఆయ‌న గాంగ్‌డాంగ్ వెళ్లారు. అమెరికా, భార‌త్‌తో డ్రాగ‌న్ దేశం ఇటీవ‌ల ఘ‌ర్ష‌ణ‌ల‌కు దిగుతున్న నేప‌థ్యంలో జీ జిన్‌పింగ్ ఈ హెచ్చ‌రిక‌లు జారీ చేసిన‌ట్లు తెలుస్తోంది.


తాజా జాతీయ వార్తల కసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/