ఆఫ్గనిస్తాన్ లో మళ్లీ తాలిబన్ల దాడి

దాడులు, ప్రతిదాడుల్లో 20 మంది సైనికులు, పోలీసుల మృతి

Taliban attack
Taliban attack

కాబూల్‌: అమెరికా-తాలిబన్ల మధ్య కుదిరిన శాంతి ఒప్పందం కుద్చుకున్న విషయం తెలిసిందే.
అయితే ఆఫ్గనిస్తాన్ లో శాంతి కనుమరుగైపోయింది. ఆఫ్ఘన్‌ సైనిక దళాలపై దాడి చేసిన తాలిబన్లు 20 మంది సైనికులను హతమార్చటంతో వారిని కాపాడుకునే పేరుతో అమెరికా వైమానిక దాడులకు దిగింది. హెల్మండ్‌ ప్రావిన్స్‌లోని సైనిక శిబిరంపై తాలిబన్లు దాడి చేయటంతో ఆఫ్ఘన్‌ సేనలను కాపాడుకునేందుకు అమెరికా బుధవారం ఉదయం వైమానిక దాడులు ప్రారంభిం చిందని అమెరికా సైనిక ప్రతినిధి ఒకరు చెప్పారు. హెల్మండ్‌ ప్రావిన్స్‌లో 11 రోజుల తరువాత జరిగిన తొలి వైమానిక దాడి ఇదేనని ఆయన వివరించారు. తాలిబన్‌ రాజకీయ విభాగపు నేతతో తాను జరిపిన భేటీ సుహృద్భావ వాతావరణంలో జరిగిందని ట్రంప్‌ ప్రకటించిన కొద్ది సేపటికే ఈ దాడులు జరగటం గమనార్హం. గత శనివారం దోహాలో శాంతి ఒప్పందంపై సంతకాలు జరిగిన తరువాత తాలిబన్‌ మిలిటెంట్లు ఆఫ్ఘన్‌ సేనలపై విరుచుకుపడ్డారు.

తాజా కెరీర్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/specials/career/