హైడ్రాక్సీక్లోరోక్విన్‌ను ఎగుమతి చేస్తాం.. భారత్‌

వెల్లడించిన భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ

hydroxcy chloroquine
hydroxcy chloroquine

దిల్లీ: మలేరియా నివారణకు వాడే హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ డ్రగ్‌ను కరోనా విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటున్న దేశాలకు అందజేస్తామని భారత విదేశాంగ మత్రిత్వశాఖ తెలిపింది. ఈ డ్రగ్‌ భారత్‌లో విరివిగా లభించడం, ప్రస్తుతం ఈ డ్రగ్‌కు ప్రపంచదేశాలలో డిమాండ్‌ ఉండడంతో పలు దేశాలు భారత్‌ వైపు చూస్తున్న విషయం తెలిసిందే. అయితే భారత్‌లో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ డ్రగ్‌ ఎగుమతిపై భారత్‌ నిషేదం విధించింది. తాజాగా ఈ నిర్ణయంపై వెనక్కి తగ్గినట్లు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/