రూ. 200 కోట్ల బడ్జెట్ తో మహేష్ పాన్ ఇండియా

MaheshBabu _ Ranveer Singh

సూపర్ స్టార్ మహేష్ బాలీవుడ్ లో అడుగుపెట్టబోతున్నాడా? అంటే అవుననే సంకేతాలు అందాయి. అంతేకాదు దాదాపు 200 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కే భారీ పాన్ ఇండియా మల్టీస్టారర్ లో అతడు నటించే అవకాశం ఉందన్న వార్త ప్రస్తుతం టాలీవుడ్ ని షేక్ చేస్తోంది.

ఓ వైపు మహేష్ 27 గురించి ఆసక్తికర చర్చ సాగుతుండగానే అతడి బాలీవుడ్ ఎంట్రీ గురించిన చర్చ మొదలవ్వడం వేడెక్కిస్తోంది. మహేష్ తాజా చిత్రం పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కనుంది. జూన్ – జూలైలో సెట్స్ పైకి వెళ్లేందుకు రెడీ అవుతున్నారు. 2020 సెకండాఫ్ షూటింగ్ చేశాక 2021 సమ్మర్ లో రిలీజ్ చేసే అవకాశం ఉంది. అటుపై మహేష్ బాలీవుడ్ లో నటించే అవకాశం ఉందని చెబుతున్నారు.

టాలీవుడ్ లో మహేష్ రేంజ్ 200 కోట్లు. అందుకే ఇప్పుడు మహేష్ తో ఓ బాలీవుడ్ స్టార్ ని కలిపి సినిమా చేస్తే అది సౌత్ నార్త్ అనే తేడా లేకుండా భారీ బిజినెస్ కి హెల్ప్ అవుతుందని భావిస్తున్నారట. ఆ క్రమంలోనే ప్రముఖ బాలీవుడ్ నిర్మాత సాజిద్ నడియావాలా మహేష్ తో సంప్రదింపులు జరుపుతున్నారని ఫిలింఫేర్ సోషల్ మీడియా వెల్లడించింది.

మహేష్ – రణవీర్ మల్టీస్టారర్ ఇది. భారీ కాన్వాసుపై తెరకెక్కించేందుకు చిత్రనిర్మాత సాజిద్ నడియావాలా ఇరువురు కథానాయకుల్ని సంప్రదించారట. ఒకవేళ ఇదే నిజమైతే బాలీవుడ్ సహా సౌత్ లోనూ క్రేజీ ప్రాజెక్టుగా భావించాల్సి ఉంటుంది.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/