జయసుధ ఇంట పెళ్లి సంబరం

Jayasudha Kapoor son Nihar Kapoor wedding reception
Jayasudha Kapoor son Nihar Kapoor wedding reception

కొద్ది రోజుల క్రితం జయసుధ పెద్ద కుమారుడు నిహార్ వివాహం జరిగింది. ఫిబ్రవరి 26వ తేదీన ఢిల్లీకి చెందిన అమృత్కౌర్ను అంగరంగ వైభవంగా పెళ్లాడిన నిహార్ కపూర్ మోములో సంతోషం వెల్లివిరుస్తోంది. . కొత్త కోడలుని చూసి అత్త జయసుధ మురిసిపోతున్నారట.

శనివారం వివాహ రిసెప్షన్ ను హైదరాబాద్ లో గ్రాండ్ గా సెలబ్రేట్ చేశారు. అదిరిపోయే అలంకారంతో అతిథులకు ఆహ్వానం పలికారు. సినీ ఇండస్ట్రీకి చెందిన అనేక మంది ఈ రిసెప్షన్ కు హాజరై నూతన వధూవరులను మనసారా ఆహ్వానించారు.

ఇందులో టాలీవుడ్ సూపర్స్టార్ కృష్ణ- నటుడు మోహన్బాబు- దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు ప్రత్యేక ఆకర్షణగా కనిపించారు.
కుమారుడు నిహార్ కపూర్ వివాహ రిసెప్షన్ లో జయసుధ అందరినీ కలుపుగోలుగా పలకరిస్తూ మర్యాదలకు ఎలాంటి లోటు లేకుండా చూసుకున్నారు. ఆమె ఇటు వరుసగా సినిమాలు చేస్తూనే.. అటు రాజకీయాల్లోనూ చురుగ్గా ఉంటున్నారు. 

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/