కీలక నిర్ణయం తీసుకున్న తాలిబన్లు

200 మంది అమెరికన్లు, ఇతర విదేశీయులు ఆఫ్ఘన్ నుంచి వెళ్లిపోయేందుకు అంగీకరించిన తాలిబన్లు

కాబుల్: ఆగస్టు 31తో ఆఫ్ఘనిస్థాన్ నుంచి అమెరికా దళాల నిష్క్రమణ పూర్తయినా, ఇంకా అక్కడ అనేకమంది అమెరికన్లు, ఇతర విదేశీయులు ఉన్నట్టు గుర్తించారు. ఆఫ్ఘన్ గడ్డపై వీరి భద్రతపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతున్న నేపథ్యంలో, తాలిబన్లు కీలక నిర్ణయం తీసుకున్నారు. 200 మంది అమెరికన్లు, పలు ఇతర దేశాలకు చెందినవారు ఆఫ్ఘన్ ను వీడేందుకు అంగీకరించారు. కాబూల్ నుంచి ప్రత్యేక విమానాల్లో వారిని తరలించేందుకు తాలిబన్లు ఒప్పుకున్నారని అమెరికా అధికారి ఒకరు తెలిపారు.

ఆఫ్ఘన్ లో తాలిబన్ల మధ్యంతర ప్రభుత్వం ఏర్పాటైన రెండ్రోజుల తర్వాత ఈ మేరకు తాలిబన్లు నిర్ణయం తీసుకున్నారు. గత ఆగస్టులో అమెరికా 1,24,000 మంది విదేశీయులను, తమకు సహకరించిన ఆఫ్ఘన్లను తరలించింది.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/news/national/