జూనియర్ కాలేజీలకు తెలంగాణ ఇంటర్‌బోర్డు హెచ్చరిక

తెలంగాణ లోని జూనియర్ కాలేజీలకు తెలంగాణ ఇంటర్‌బోర్డు హెచ్చరిక జారీ చేసింది. దసరా సెలవుల్లో ఎవరైనా క్లాస్ లు నిర్వహిస్తే ఊరుకునేది లేదని స్పష్టం చేసింది. తెలంగాణలో జూనియర్ కాలేజీలకు రేపటి నుంచి ఈ నెల 9వ తేదీ వరకు దసరా సెలవులు ప్రకటించారు ఇంటర్ బోర్డ్. తిరిగి అక్టోబర్ 10న కాలేజీలు తెరుచుకుంటాయని స్పష్టం చేసారు.

ఈ నేపథ్యంలో తెలంగాణ ఇంటర్‌బోర్డు కీలక ప్రకటన చేసింది. సెలవుల్లో కనుక ప్రైవేటు కళాశాలలు తరగతులు నిర్వహిస్తే వాటి గుర్తింపును రద్దు చేస్తామని హెచ్చరించింది. అలాగే, కళాశాలల యాజమాన్యాలు, ప్రిన్సిపాళ్లపైనా చర్యలు ఉంటాయని పేర్కొంది. ఈ మేరకు ఇంటర్ బోర్డు కార్యదర్శి తెలిపారు. అన్ని ప్రైవేట్, ప్రభుత్వ, ఎయిడెడ్, కో ఆపరేటివ్, గురుకుల కాలేజీలకు ఇది వర్తిస్తుందని పేర్కొన్నారు.