రాష్ట్రంలో పాలన ఎప్పుడో గాడి తప్పిందంటూ ఆర్టిస్ట్ పృథ్వీ కీలక వ్యాఖ్యలు

మాజీ వైస్సార్సీపీ నేత , ఆర్టిస్ట్ పృథ్వీ బుధువారం కడప పెద్ద దర్గాను దర్శించుకున్నారు. ప్రస్తుతం ఈయన ‘ఏపీ జీరో ఫోర్ రామాపురం’ చిత్రంలో నటిస్తున్నారు. ఈ తరుణంలో చిత్ర బృందంతో కలిసి కడప పెద్ద దర్గాను దర్శించుకున్నారు.

ఈ సందర్భంగా పృథ్వీ మాట్లాడుతూ, కడప పెద్ద దర్గాను దర్శించడాన్ని గొప్ప అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు. గతంలో ఇక్కడికి చాలాసార్లు వచ్చానని, ఈసారి ‘ఏపీ జీరో ఫోర్ రామాపురం’ చిత్రం కోసం ఇక్కడికి వచ్చానని వెల్లడించారు. ఈ క్రమంలో మీడియా వారు రాజకీయాల ఫై పలు ప్రశ్నలు వేయగా.. రాష్ట్రంలో పరిస్థితులు ఎలా ఉన్నాయో అందరికీ తెలిసిందేనని, ఇవాళ ఉర్సు సందర్భంగా దర్గా వద్దకు వచ్చామని, ఉర్సు రోజున ఆ భగవంతుడే రాష్ట్రాన్ని కాపాడాలని అన్నారు. రాష్ట్రంలో పాలన ఎప్పుడో గాడి తప్పిందని పృథ్వీ వ్యాఖ్యానించారు.