హాస్పటల్ లో ఎమ్మెల్యే రాజాసింగ్..

ఎమ్మెల్యే రాజాసింగ్ హాస్పటల్ లో ఉన్న పిక్ సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. రాజాసింగ్ కు ఏమైందా అని అంత ఆరాతీస్తున్నారు. రాజాసింగ్ కు ఏమైంది..? ఎందుకు హాస్పటల్ లో చేరారు..? ఇప్పుడు ఎలా ఉంది ఇలా అనేకమంది అనేక విధాలుగా మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. కానీ రాజాసింగ్ ఆరోగ్యం విషయంలో ఖంగారు పడాల్సిన అవసరం లేదు. ఆయన ఆరోగ్యానికి ఎలాంటి డోకా లేదు. ఈ మధ్య పీడీ యాక్టు కింద జైల్‌కు వెళ్లిన రాజాసింగ్.. అక్కడి నుంచి ఈ మధ్యే బెయిల్ మీద బయటకు వచ్చారు. అయితే.. జైలు నుంచి బయటకు వచ్చే ముందే తన నుదుటి మీద చిన్న గడ్డ అయ్యిందంటా. ఆ గడ్డ కారణంగా తాను చాలా ఇబ్బంది పడగా.. వైద్యులను సంప్రదించారు. పరీక్షించిన డాక్టర్లు చిన్న ఆపరేషన్ చేయాలని సూచించారట. ఈ నేపథ్యంలోనే.. ఈరోజు ఆస్పత్రిలో చేరిన రాజాసింగ్‌కు వైద్యులు లిపోమా సర్జరీ చేశారు. ఈ విషయాన్ని రాజాసింగ్ స్వయంగా తెలియజేశారు.

” జైలు నుంచి బయటకు రావటానికి ముందే.. నా నుదిటిపై చిన్న గడ్డ అయ్యింది. ఆ గడ్డ వల్ల చాలా నొప్పి వచ్చింది. దాని కారణంగానే ఈ రోజు ఆస్పత్రిలో చేరాను. వైద్యులు నాకు లిపోమా సర్జరీ చేశారు. ఈ సర్జరీ కారణంగా.. వారం రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. దీని నుంచి తేరుకుని.. నేను అతి త్వరలోనే నా గోషామహల్ ప్రజల మధ్య ఉంటాను..” అంటూ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. తన ఆరోగ్యం బాగానే ఉందని.. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ఆయన ఆరోగ్యానికి ఎలాంటి అపాయం లేదని తెలిసి.. అందరూ ఊపిరి పీల్చుకున్నారు.