అనసూయ ‘ప్రేమ విమానం’ నికి మహేష్ సాయం

సూపర్ స్టార్ మహేష్ బాబు..కేవలం తన సినిమాల ప్రమోషన్ లలోనే కాదు వేరే హీరోల సినిమాలను సైతం ప్రమోషన్ చేస్తుంటారు. తాజాగా అనసూయ నటించిన ‘ప్రేమ విమానం’ వెబ్ ఫిలిం కు సాయం చేయబోతున్నాడు.

ఈ వెబ్ ఫిల్మ్‌ను అభిషేక్ పిక్చర్స్, జీ5 సంయుక్తంగా నిర్మించాయి. ఇటీవలే ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను విడుదల చేసి ఆకట్టుకోగా..రేపు (ఏప్రిల్ 27న) ఉదయం 10.08 గంటలకు ‘ప్రేమ విమానం’ టీజర్‌ను మహేష్ బాబు విడుదల చేయబోతున్నారు. ఈ విషయాన్ని అనసూయ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ‘ప్రేమలో ఉన్న మాయాజాలానికి సూపర్ స్టార్‌గా రాజ్యమేలుతోన్న మహేష్ బాబు నుంచి లైసెన్స్ వచ్చేసింది’ అంటూ అనసూయ ఆనందం వ్యక్తం చేశారు.

సంగీత్ శోభన్, శాన్వీ మేఘన జంటగా నటించగా, వెన్నెల కిషోర్, అనసూయ భరద్వాజ్ ఇలా పలువురు నటించారు. ఎలాగైనా సరే విమానం ఎక్కాలని ప్రయత్నించే ఇద్దరు పిల్లలు, అర్జెంట్‌గా ఫ్లైట్ ఎక్కి తమ కొత్త జీవితాన్ని ప్రారంభించాలని అనుకునే ఓ ప్రేమ జంట.. ఇలా అందరినీ ఒకే చోటకు చేర్చుతుంది కథ. ఇక వీరి ప్రయాణంలో వచ్చే మలుపులు, సంతోషాలు, బాధలు, నవ్వులు అన్నీ ప్రేక్షకులను మెప్పించేలా ఉంటాయని చిత్ర యూనిట్ చెబుతుంది.