ఒకే వేదిక ఫై యంగ్ టైగర్ – సూపర్ స్టార్

ఎన్టీఆర్ – మహేష్ బాబు లు ఒకే వేదిక ను పంచుకోబోతున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్ ఓ పక్క సినిమాలు చేస్తూనే..మరోపక్క హోస్ట్ గా బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తున్నారు. జెమినీ టీవీ లో ప్రసారమవుతున్న ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ షో కు హోస్ట్ గా వ్యవహరిస్తూ ఆకట్టుకుంటున్నారు. ఇక ఈ షో కు సూపర్ స్టార్ మహేష్ బాబు రాబోతున్నట్లు తెలుస్తుంది.

దసర పండుగ సందర్భంగా వచ్చే ప్రత్యేక ఎపిసోడ్‌లో మహేష్ అతిథిగా రాబోతున్నారు అని సమాచారం. ఈ షోలో పాల్గొనేందుకు మహేశ్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారని.. త్వరలోనే ఈ ఎపిసోడ్‌ షూట్‌ జరగనుందని సమాచారం. గతంలో ‘భరత్‌ అను నేను’ సినిమా ఈవెంట్‌లో ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇప్పుడు ఎన్టీఆర్ షోలో మహేష్ ముఖ్య అతిథి వస్తున్నారని తెలియడంతో అభిమానుల్లో రెట్టింపు ఉత్సాహం నెలకొంది.

ఇక రేపు (సెప్టెంబర్ 20 ) ప్రసారం కానున్న షో లో రాజమౌళి, కొరటాల శివలు రాబోతున్నారు. ”నేనే బాస్ ఇక్కడ” ‘లొకేషన్ నాది డైరెక్షన్ నాది’ అంటూ వాళ్లకు షాకిచ్చారు. తాజాగా విడుదలైన ప్రోమోలో ఈ సీన్ హైలైట్ అవుతోంది.