తేజ్ రోడ్డు ప్రమాదం : తెరపైకి కొత్త అనుమానాలు

తేజ్ రోడ్డు ప్రమాదం : తెరపైకి కొత్త అనుమానాలు

మెగా హీరో సాయి ధరమ్ తేజ్ శుక్రవారం రాత్రి రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం అపోలో హాస్పటల్ లో చికిత్స తీసుకుంటున్నారు. అయితే ఈ ప్రమాదం ఫై పోలీసులు పలు అనుమానాలు రేకెత్తిస్తున్నారు. తేజ్ కు బైక్ రైడింగ్ అంటే చాల ఇష్టమనే సంగతి తెలిసిందే. ఎక్కువగా స్పోర్ట్స్ బైక్ లను కొనుగోలు చేసి వాటితో తేజ్ రైడింగ్ చేస్తుంటారు. తేజ్ తో పాటు సీనియర్ నటుడు నరేష్ కొడుకు నవీన్ ఇద్దరు కలిసి రైడింగ్ లు చేస్తుంటారని తెలియడం తో పోలీసులు ఆ నేపథ్యంలో ఆరా తీస్తున్నారు.

సాయి ధరమ్ తేజ్ , నవీన్ , మరో వ్యక్తి కలిసి ఒక డెస్టి నేషన్ పెట్టుకుని ఎవరు ముందు.. వెళ్తారనే దానిపై రైడింగ్ జరిగినట్టు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు పోలీసులు. ఈ నేపథ్యం లోనే రైడింగ్, రేసింగ్ కోణం లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ప్రమాదం ఫై నరేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను బైక్ రైడింగ్ లకు వెళ్ళొద్దని తన కొడుకును, తేజ్ ను హెచ్చరించా అని కానీ వినలేదన్నారు. దాంతో కౌన్సిలింగ్ ఇప్పిద్దాం అనుకున్నా అని నరేష్ తెలిపారు. వీళ్ళందరికీ బైక్ క్లబ్ ఉందన్నారు. అందరికీ 1000 సిసి బైక్స్ ఉన్నాయి. మళ్ళీ బైకుల జోలికి వెళ్లకుండా ఒట్టు పెట్టించుకుంటామని నరేష్ చెప్పారు. ఇక నరేష్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారాయి.