మ‌హారాష్ట్ర‌లో కొవిడ్ నియంత్ర‌ణ‌ల స‌డ‌లింపు!

అర్ధ‌రాత్రి వ‌ర‌కూ రెస్టారెంట్ల‌కు అనుమ‌తి

ముంబయి: మ‌హారాష్ట్ర‌లో క‌రోనా వైర‌స్ వ్యాప్తి త‌గ్గుముఖం ప‌ట్ట‌డంతో కొవిడ్‌-19 నియంత్ర‌ణ‌ల‌ను రాష్ట్ర ప్ర‌భుత్వం స‌డ‌లించింది. మ‌హారాష్ట్ర అంత‌టా అన్ని రెస్టారెంట్లు, తినుబండారాల దుకాణాల‌ను అర్ధ‌రాత్రి 12 గంట‌ల వ‌ర‌కూ అనుమ‌తించాల‌ని నిర్ణ‌యించింది.

ఇత‌ర అనుమ‌తించిన అన్ని వ్యాపార సంస్ధ‌లు, దుకాణాలు రాత్రి 11 గంట‌ల వ‌ర‌కూ తెరిచిఉంచేందుకు ప్ర‌భుత్వం అనుమ‌తించింది. వైర‌స్ వ్యాప్తికి అనుగుణంగా స్ధానిక అధికారులు ఈ స‌మ‌యాల‌ను కుదించ‌వచ్చ‌ని, ముంద‌స్తు అనుమ‌తి లేకుండా వీటికి స‌డ‌లింపులు ఇవ్వ‌రాద‌ని ప్ర‌భుత్వం జారీ చేసిన ఉత్త‌ర్వుల్లో స్ప‌ష్టం చేసింది.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/