బలపరీక్షలో నెగ్గిన సీఎం ఏక్‌నాథ్ షిండే

Maharashtra Chief Minister Eknath Shinde wins trust vote

ముంబయిః మహారాష్ట్రలో సీఎం ఏక్ నాథ్ షిండే బలపరీక్ష కోసం నేడుప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు నిర్వహించారు. ఈసందర్భంగా ఏక్ నాథ్ షిండే బలపరీక్షలో నెగ్గారు. షిండే సర్కారుకు 164 మంది ఎమ్మెల్యేలు మద్దతు పలికారు. దీంతో ఏక్ నాథ్ షిండే సర్కార్ బలపరీక్షలో నెగ్గింది. కొన్ని వారాల నుంచి సాగుతున్న మ‌హారాష్ట్ర‌ అసెంబ్లీ సంక్షోభం అనూహ్య మ‌లుపులు తిరిగిన విష‌యం తెలిసిందే. శివ‌సేన రెబ‌ల్‌గా షిండే తిరుగుబాటు చేయ‌డంతో ఉద్ద‌వ్ ఠాక్రే త‌న సీఎం ప‌ద‌వికి రాజీనామా చేశారు. ఆ త‌ర్వాత జ‌రిగిన ప‌రిణామాల‌తో ఏక్‌నాథ్ సీఎం అయ్యారు. అయితే ఆయ‌న ఇవాళ బ‌ల‌ప‌రీక్ష‌లో నెగ్గారు. ఇవాళ ఓటింగ్‌లో ప్ర‌తిప‌క్షానికి 99 ఓట్లు పోల‌య్యాయి. ఎమ్మెల్యేల లెక్కింపు ద్వారా మెజారిటీని తేల్చారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/telangana/