కలర్ ఫోటో చిత్ర యూనిట్ ను అభినందించిన మంత్రి తలసాని

జాతీయ స్థాయిలో ఉత్తమ చిత్రంగా ఎంపికై భారత రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డును అందుకున్న కలర్ ఫోటో చిత్ర యూనిట్ ను మంత్రి తలసాని అభినందించారు. చిత్ర దర్శకులు సందీప్ రాజ్.. మంత్రి శ్రీనివాస్ యాదవ్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా తనకు లభించిన అవార్డు, ప్రశంస పత్రాన్ని మంత్రికి చూపించారు. గత నెల 30వ తేదీన ఢిల్లీలో నిర్వహించిన 68వ జాతీయ ఫిలిం అవార్డ్ వేడుకల్లో కలర్ ఫోటో మూవీ జాతీయ ఉత్తమ చిత్రంగా ఎంపికైన విషయాన్ని డైరెక్టర్ సందీప్ రాజ్ మంత్రికి వివరించారు. తెలుగు చలన చిత్రాలకు జాతీయ, అంతర్జాతీయ స్థాయి లో గుర్తింపు లభించడం ఎంతో సంతోషదాయకం మంత్రి తలసాని ఈ సందర్బంగా అన్నారు. ఇక మంత్రిని కలిసిన వారిలో యాదవ్ సంఘం రాష్ట్ర యువజన నాయకులు నవీన్ యాదవ్, రాహుల్ యాదవ్, ప్రదీప్, వంశీరెడ్డి, గంగాధర్ తదితరులు ఉన్నారు.