దివ్య విమాన గోపురంపై శ్రీ సుద‌ర్శ‌న చ‌క్రానికి కేసీఆర్ ప్ర‌త్యేక పూజ‌లు

శ్రీ సుద‌ర్శ‌న చ‌క్రానికి ప‌విత్ర జ‌లాల‌తో అభిషేకం

యాదాద్రి : యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి స్వయంభూ దర్శన ప్రారంభోత్సవ కార్యక్రమం కొనసాగుతోంది. దివ్య విమాన గోపురంపై శ్రీ సుద‌ర్శ‌న చ‌క్రానికి తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించారు. ప‌విత్ర జ‌లాల‌తో అభిషేకం చేశారు. ఈ సంద‌ర్భంగా కేసీఆర్‌కు కంక‌ణ‌ధార‌ణ చేసిన‌ పండితులు ఆశీర్వ‌చ‌నం అందించారు.

అక్క‌డి ఏడు గోపురాల‌పై ఉన్న క‌ల‌శాల‌కు ఏక‌కాలంలో కుంభాభిషేకం, సంప్రోక్ష‌ణ నిర్వ‌హించారు. మ‌హాకుంభ సంప్రోక్ష‌ణ మ‌హోత్స‌వం ముగిసిన అనంత‌రం ప్ర‌ధానాల‌య ప్ర‌వేశ కార్య‌క్ర‌మం ఉంటుంది. ఉపాల‌యాల్లోని ప్ర‌తిష్ఠామూర్తుల‌కు మ‌హాప్రాణ‌న్యాసం చేస్తారు. ఆరాధ‌న సంప్రోక్ష‌ణ అనంత‌రం గ‌ర్భాల‌యంలో స్వ‌యంభువుల ద‌ర్శ‌నం ప్రారంభం అవుతుంది.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/