మత్స్యకారులను వరించిన సంక్షేమం

సిఎం జగన్‌కు ధన్యవాదాలు తెలిపిన మత్స్యకార కుటుంబాలు

Fisher woman talking in AP CM Jagan Video Conference

విజయవాడ: సముద్రాన్ని నమ్ముకుని జీవిస్తున్న మత్స్యకార్మికుల అభ్యున్నతి కోసం మచిలీపట్నంకు ఫిషింగ్‌ హార్బర్‌ మంజూరు చేశామని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహనరెడ్డి తెలిపారు.

వైఎస్సార్‌ మత్స్యకార భరోసా పథకం కింద కృష్ణాజిల్లాలోని 9,192 మత్స్యకార కుటుంబాలకు సముంద్రంలో వేట నిషేధ కాలంలో రూ.10వేల ఆర్థిక సహాయాన్ని సిఎం వారి బ్యాంకు అకౌంటర్లలో జమచేశారు. బుధవారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఈ కార్యక్రమానఇన సిఎం ప్రారంభించారు.

కాగా కృష్ణాజిల్లా నుంచి ముగ్గురు మంత్రుల రవాణా, సమాచారశాఖ మంత్రి పేర్ని వెంట్రామయ్య (నాని), పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని, దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌, బ్రాహ్మణ కార్పొరేషన్‌ చైర్మన్‌ మల్లాది విష్ణు , జిల్లా కలెక్టర్‌ ఎఎంజి ఇంతియాజ్‌ పాల్గొన్నారు.

ఈసందర్భంగా సిఎం జగన్మోహనరెడ్డి మాట్లాడారు. రాష్ట్రంలో 3వేల కోట్ల రూపాయలతో 8 మేజర్‌ ఫిషింగ్‌ హార్బర్లు మంజూర ఉచేశామన్నారు.

అందులో మచిలీపట్నం కూడ ఉందన్నారు.. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా కలెక్టర్‌ ఇంతియాజ్‌ మాట్లాడుతూ, జిల్లాఓని 9,192 మంది మత్స్యకార కుటుంబాలకు వైఎస్సార్‌ మత్స్యకార పథకం కింద ప్రయోజనం చేకూరుతుందన్నారు.

AP Ministers- Krishna District Collector in CM Video Conference

ఒక్కొక్క కుటుంబం రూ.10వేలు జమ అవుతున్నందుకు గంగపుత్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారన్నారు. డీజిల్‌ సబ్సిడీని రూ.6.03 నుంచి రూ.9కి పెంచటం ఎంతో మేలు చేకూర్చిందన్నారు.

స్మార్ట్‌కార్డుల ద్వారా అప్పటికపుడే డీజల్‌ కొనుగోలులో లబ్దిపొందుతున్నారన్నారు..

జిల్లాలో ఇటీవల గాలి,వాన, తుఫ్‌ా వల్ల అనుకోని సంఘటన జరిగిందని కృతివెన్ను గ్రామంలో వర్లగూడితిప్ప గామానికి చెందిన 6గురు వేటకు వెళ్లిన మత్స్యకారుల సముద్రంలో మునిగి మృతిచెందారన్నారు.వారందదికీ రూ.5లక్షల నుంచి పెంచిన ప్రభుత్వ ఆర్థికసాయం రూ.10లక్షలు సంఘటన జరిగిన రెండోరోజే అందించామన్నారు.

మచిలీపట్నం మండలంలోని తాళ్లపాలెం గ్రామానికి చెందిన బలగం వీరరాఘవమ్మ మాట్లాడుతూ, గత ప్రభుత్వాలు రూ.2వేలు, రూ.4వేలు చొప్పున మత్స్యకారులకు ఆర్థికాసయం ఇచ్చాయని, అవికూడ ఏనాటికో రావటం జరిగిందన్నారు.

ఆసొమ్ము అందినవానడు హమ్మయ్య ఇవాళ్ల డబ్బులు వచ్చాయని అనుకునేవాళ్లం అన్నారు.అలాంటిది మీరు ముఖ్యమంత్రి అయ్యాక వేట నిషేధ ప్రారంభ కాలంలోనే రూ.10వేలు అందించటం ఆనందంగా ఉందన్నారు.

ఏపార్టీ అని చూడకుండా తమ పాదయాత్రలో ఇచ్చిన మాట ప్రకారం చెప్పిన తేదీకే సముద్రంపై వేట నిషేధం చేసిన 15రోజులకే డబ్బులువేయటం మీకు పేదప్రజలపై ఉన్న ప్రేమ తెలియజేస్తుందన్నారు.. ఇంతవరకూ ఎవరూ ఇంత గొప్ప పనిచేయలేదన్నారు.

డీజిల్‌ సబ్సిడీని రూ.6.03నుంచి రూ.9 చేయటంద్వారా మీమేలు మరువలేమన్నారు. అంతేకాకుండా మీరు పెంచిన డీజిల్‌ సబ్సిడీ మూలంగా రూ.10 లీటలర్ల డీజిల్‌ను 8లీటల్ల డీజల్‌ ధరకే పొందగలుగుతున్నామన్నారు..

అంతేకాకుండా లబ్దిదారునికి వెంటనే సొమ్ము అందుతుందన్నారు..

మత్స్యకారులంటే గత ప్రభుత్వాలకు చిన్నచూపు ఉండేదని, అలాంటిది మీరు గొప్ప మనసుతో ఎలాంటి తారతమ్యాలు చూపకుండా మా అభ్యున్నతికి సహకారం అందిస్తున్నారని అన్నారు.

ఇళ్లపట్టాల కోసం స్థానిక మంత్రి పేర్ని నాని దృష్టికి తీసుకువెళ్లగా వారు స్పందిస్తూ వారు జాయింట్‌ కలెక్టర్‌ మత్స్యకారులకు ఇళ్లపట్టాలుఅందించే బాధ్యత మాది అని మీరు ఎటువంటి ఇబ్బందులు పడనవసరం లేదని చెప్పారని, ఇందుకు తమకు ధన్యవాదాలు తెలియజేస్తున్నామని ఆమె పేర్కొన్నారు.

కార్యక్రమంలో కృతివెన్ను మండలం వర్లగూడెంతిప్ప గ్రామానికి చెందిన జాల్లా లక్ష్మీ సిఎంతో మాట్లాడుతూ,ఏప్రిల్‌ 9న సముద్రంపై వేటకు వెళ్లిన తన భర్త, ఇద్దరు కుమారులు నీట మునిగారన్నారు.

గాలివాన వీస్తుంటే నేను ఇంటిదగ్గర భగవంతుడిని ప్రార్ధించుకుంటూ కూర్చున్నానని, పెద్దకుమారుడు నీటిలో తేలితూ చెక్కముక్క సాయంతో ఒడ్డుకు వచ్చాడన్నారు..

భర్త, చిన్నకుమారుడు సముద్రంలో మునిగిపోగా వాళ్ల మృతదేహాలు రెండు రోజులకు దొరికాయని కన్నీరు పెట్టుకుంది..

తమ మంత్రి పేర్ని నాని, ఎమ్మెల్యే జోగిరమేష్‌ , కలెక్టర్‌ ఇంతియాజ్‌ తదితరులు వచ్చి తమ కుటుంబానికి మనోధైర్యం ఇచ్చారన్నారు.

అంతేకాకుండా జిల్లా కలెక్టర్‌, మంత్రి నాని తదితరులు రెండు రోజుల్లోనే తమకు ఆర్థిక సహాయాన్ని అందించి ఎంతో ఓదార్చారన్నారు. ఈ విషయంలో జగనన్న చేసిన మేలు ఎప్పటికీ మరువలేమని లక్ష్మీ తెలిపారు.

ఈసందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహనరెడ్డిజోక్యం చేసుకుంటూ,, ‘ధైర్యంగా ఉండు తల్లీ.. ఇంతియాజ్‌ అన్నా వారిని బాగా చూసుకోండి అంటూ భరోసా ఇచ్చారు.

తాజా తెలంగాణ వార్తల కోసం :https://www.vaartha.com/telangana/