‘మహా సముద్రం’ ప్రీ రిలీజ్ ఈవెంట్ డీటెయిల్స్

శర్వానంద్ – బొమ్మరిల్లు ఫేమ్ సిద్ధార్థ్ హీరోలుగా ఆర్ఎక్స్ 100 డైరెక్టర్ అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ మల్టీస్టారర్ చిత్రం ”మహాసముద్రం”. ఇంటెన్స్ లవ్ అండ్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాలో అదితి రావు హైదరి – అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్లుగా నటించగా. ఎ.కె.ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై సుంక‌ర రామ‌బ్ర‌హ్మం నిర్మిస్తున్నారు.

ఈ చిత్రాన్ని దసరా కానుకగా అక్టోబర్ 14న ప్రపంచ వ్యాప్తంగా థియేట్రికల్ రిలీజ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ స్పీడ్ పెంచిన యూనిట్.. ఈ మధ్యనే చిత్ర థియేట్రికల్ ట్రైలర్ ను రిలీజ్ చేసి సినిమా ఫై అంచనాలు పెంచారు. ఇక ఇప్పుడు ప్రీ రిలీజ్ కు సంబదించిన డేట్ ను ఫిక్స్ చేసారు. ఈ మేరకు టైం, డేట్, ప్లేస్ ను ఖరారు చేస్తూ తాజాగా పోస్టర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. అక్టోబర్ 9 న జెఆర్‌సి కన్వెన్షన్‌లో లో ‘మహా సముద్రం’ సాయంత్రం 6 గంటలకు జరగనుంది. ఈ చిత్రంలో జగపతి బాబు, రావు రమేష్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై అనిల్ సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, చైతన్ భరద్వాజ్ సంగీతం అందించారు.