ఢిల్లీలో ముగ్గురికి కరోనా వైరస్‌ లక్షణాలు

Coronavirus
Coronavirus

న్యూఢిల్లీ: చైనాతో సహ పలు దేశాలను వణికిస్తున్న కరోనా వైరస్‌ తాజాగా భారత రాజధాని ఢిల్లీలో కూడా ముగ్గురికి కరోనా వైరస్‌ సోకినట్లు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం ఆ ముగ్గురికి డాక్టర్‌ రామ్‌ మనోహర్‌ లోహియా హాస్పిటల్‌లో చికిత్స అందిస్తున్నారు. కరోనా రోగులకు ప్రత్యేక వార్డులో ట్రీట్‌మెంట్‌ ఇస్తున్నట్లు డాక్టర్‌ మీనాక్షి భరద్వాజ్‌ తెలిపారు. భారత్‌లో ప్రస్తుతం 450 మందిని అబ్జర్వేషన్‌లో పెట్టారు. కేరళలో ఎక్కువ మందిని పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల వీళ్లంతా చైనా నుంచి తిరిగి వచ్చినట్లు భావిస్తున్నారు. గత మూడు రోజుల నుంచి సుమారు 29 వేల మంది చైనా నుంచి ఇండియాకి వచ్చారు. వారిని ఎప్పటికప్పుడు స్క్రీనింగ్‌ చేస్తున్నారు. మరోవైపు వుహన్‌ సిటీలో ఉన్న సుమారు 250 మంది భారతీయ విద్యార్థులను వెనక్కి తీసుకువచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది.

తాజా వీడియోస్‌ కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/videos/