రాహుల్‌ గాంధీపై శివరాజ్‌ సింగ్‌ సెటైర్లు

రాహుల్ గాంధీకి ఉల్లిగడ్డ భూమిలో పెరుగుతుందో, బయట పెరుగుతుందో కూడా తెలియదు

cm-shivraj-singh-chouhan

భోపాల్‌: మధ్యప్రదేశ్‌ సిఎం శివరాజ్ సింగ్ చౌహాన్ కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీపై విమర్శలు గుప్పించారు. ట్రాక్టర్లపై తిరిగినంత మాత్రాన వ్యవసాయం గురించి తెలుసుకోలేరని, సోఫాలపై కూర్చునే రాహుల్ గాంధీ వ్యవసాయ చట్టంపై విమర్శలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు. చివరికి ఉల్లిగడ్డ భూమి లోపల పెరుగుతుందో, బయట పెరుగుతుందో కూడా తెలియదని ఎద్దేవా చేశారు. ఎన్డీయే సర్కారు తీసుకువచ్చిన వ్యవసాయ బిల్లులను కాంగ్రెస్ తీవ్రంగా విమర్శిస్తుండడాన్ని శివరాజ్ సింగ్ చౌహన్ ఈ విధంగా తిప్పికొట్టే ప్రయత్నం చేశారు. రాహుల్ కు కనీసం వ్యవసాయంలో ఒక్క విషయం అయినా తెలుసా? అని ప్రశ్నించారు. ఖేతీ బచావో యాత్ర పేరిట కేంద్రం బిల్లులపై నిరసనలు తెలుపుతూ రాహుల్ పంజాబ్ లో ట్రాక్టర్ యాత్ర నిర్వహించిన సంగతి తెలిసిందే. అటు, కేంద్రమంత్రి స్మృతి ఇరానీ కూడా రాహుల్ ను వీఐపీ రైతు అంటే హేళన చేశారు. ట్రాక్టర్ పై మెత్తని పరుపు వంటి ఆసనంపై రాహుల్ కూర్చుని ఉన్న ఫొటోలు వైరల్ అవుతున్న నేపథ్యంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/