సెబీకి నూత‌న చైర్ ప‌ర్స‌న్‌గా మాధ‌వి పూరీ బుచ్

బుచ్‌ను నియ‌మిస్తూ కేంద్రం నిర్ణయం

న్యూఢిల్లీ: దేశంలో ప‌లు కీల‌క ప‌ద‌వుల‌ను మ‌హిళ‌లు అందిపుచ్చుకుంటున్నారు. తాజాగా సెక్యూరిటీస్ అండ్ ఎక్సేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) నూత‌న చైర్ ప‌ర్స‌న్‌గా మాధ‌వి పూరీ బుచ్ నియ‌మితుల‌య్యారు. ఈ మేర‌కు కేబినెట్ అపాయింట్స్ మెంట్ క‌మిటీ బుచ్ నియామ‌కానికి సంబంధించి ఉత్త‌ర్వులు జారీ చేసింది. మూడేళ్ల పాటు బుచ్ ఈ ప‌ద‌విలో ఉంటారు. ఈ నియామ‌కంతో సెబీ చ‌రిత్ర‌లో ఓ మ‌హిళ ఆ సంస్థ‌కు బాస్‌గా నియ‌మితులైన‌ట్టైంది. ఇప్ప‌టిదాకా సెబీకి ఏ ఒక్క మ‌హిళ కూడా చైర్మ‌న్‌గా ప‌ద‌వీ బాధ్య‌త‌లు చేప‌ట్టలేదు.

సెబీ చైర్మ‌న్ అజ‌య్ త్యాగి ఐదేళ్ల ప‌ద‌వీ కాలం సోమ‌వారంతో ముగిసిపోయింది. ఈ నేప‌థ్యంలో త‌క్ష‌ణ‌మే బుచ్‌ను సెబీ చైర్ ప‌ర్స‌న్‌గా నియ‌మిస్తూ కేంద్రం నిర్ణ‌యం తీసుకుంది. మాధ‌వి పూరీ బుచ్ కెరీర్ విష‌యానికి వ‌స్తే.. ప్రైవేట్ బ్యాంకింగ్ దిగ్గ‌జం ఐసీఐసీఐలో కెరీర్ ప్రారంభించిన బుచ్‌.. రెండు ద‌శాబ్దాల పాటు అదే బ్యాంకులో వివిద హోదాల్లో ప‌నిచేశారు. 2009 నుంచి 2011 మ‌ధ్య కాలంలో ఐసీఐసీఐ సెక్యూరిటీస్‌కు ఎండీగానే కాకుండా సీఈఓగానూ వ్య‌వ‌హ‌రించారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/