వైస్సార్సీపీ నేతలపై నారా లోకేష్ పిర్యాదు

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్..వైస్సార్సీపీ నేతలపై మంగళగిరి కోర్టులో పిటిషన్ దాఖలు చేసారు. సోషల్ మీడియా వేదికగా వైస్సార్సీపీ ఎమ్మెల్సీ పోతుల సునీత, వైస్సార్సీపీ సోషల్ మీడియా కన్వీనర్ దేవేందర్ రెడ్డి అభ్యంతరకర ప్రచారం చేస్తున్నారని పిటిషన్ లో పేర్కొన్నారు. తప్పుడు ప్రచారంతో తన పరువుకి భంగం వాటిల్లేలా చేస్తున్నారని ..వీరిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోర్టును కోరారు.

ఇక ఈరోజు టీడీపీ ‘ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి’ అనే కార్యక్రమం ప్రారంభించారు. ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గం పరిధిలోని విజయరాయిలో చంద్రబాబు ఈ కార్యక్రమంలో పాల్గొని , వైస్సార్సీపీ ఫై ఆగ్రహం వ్యక్తం చేయగా..మంగళగిరి నియోజకవర్గం తాడేపల్లిలో నిర్వహించిన ‘ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి’ కార్యక్రమంలో లోకేశ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. జగన్ రెడ్డి రాష్ట్రానికి పట్టిన ఖర్మ అని లోకేశ్ అన్నారు. జగన్ రెడ్డి విధ్వంస పాలనను చూసి కొత్త పరిశ్రమలు రావట్లేదని, ఉన్నవి తరలిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. తన కేసుల కోసం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టిన జగన్ ముఖ్యమంత్రి కావడం రాష్ట్ర ప్రజల ఖర్మ అని ఆరోపించారు.