దేశవ్యాప్తంగా అల్లర్లను కాంగ్రెస్‌ ప్రోత్సహిస్తుంది

సీఏఏను వెనక్కి తీసుకునే ప్రసక్తే లేదని స్పష్టం చేసిన కేంద్ర హోంమంత్రి

Amit Shah
Amit Shah

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా అల్లర్లను కాంగ్రెస్‌ ప్రోత్సహిస్తుందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా ఆరోపించారు. దేశంలోని పలు ప్రాంతాల్లో వ్యతిరేక, అనుకూల ప్రదర్శలనతో చర్చనీయాంశంగా మారిన పౌరసత్వం చట్టం సీఏఏ అమలుపై ఆయన మరోసారి వ్యాఖ్యానించారు. సీఏఏను వెనక్కి తీసుకునే ప్రసక్తే లేదని అమిత్‌ షా కుండబద్ధలు కొట్టారు. లక్నోలో మంగళవారం జరిగిన సీఏఏ అనుకూల ర్యాలీలో అమిత్‌ షా మాట్లాడుతూ..దేశాన్ని ముక్కలు చేయండంటున్న టుకడే టుకడే గ్యాంగ్‌కు కాంగ్రెస్‌ మద్దతుగా నిలుస్తుందని దుయ్యబట్టారు. ఇండియాకు వ్యతిరేకంగా పనిచేస్తే జైలుకేనని అమిత్‌ షా ఘాటుగా వ్యాఖ్యానించారు. సీఏఏపై రాహుల్‌ గాంధీ, బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఎక్కడ చర్చ కోరుకుంటే అక్కడ చర్చకు బిజెపి సిద్దము అంటూ అమిత్‌ షా సవాల్‌ విసిరారు. ఇంకా కాంగ్రెస్‌, పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ ఒకే స్వరంతో మాట్లాడుతున్నారంటూ మండిపడ్డారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/