కరోనా బారినపడిన థమన్..త్వరగా కోలుకోవాలని అభిమానుల ట్వీట్స్

SSTHAMAN
SSTHAMAN

కరోనా మహమ్మారికి సంచలన మ్యూజిక్ డైరెక్టర్ థమన్ చిక్కాడు. ఇప్పటికే చిత్రసీమలో మహేష్ బాబు , మంచు లక్ష్మి , మీనా , వర లక్ష్మి శరత్ కుమార్ వంటి వారు కరోనా తో బాధపడుతుండగా..తాజాగా వీరి జిబితాలో థమన్ చేరాడు. రెండు రోజులుగా జలుబు , జ్వరం తో బాధపడుతున్న థమన్..ఈరోజు కరోనా పరీక్షలు చేసుకోగా..పాజిటివ్ అని తేలింది.

దీంతో డాక్టర్స్ సలహా మేరకు ఇంట్లోనే ఐసోలేషన్ లో ఉన్నారు. గత కొన్నిరోజులుగా తనను కలిసిన వారందరూ తప్పనిసరిగా కరోనా పరీక్షలు చేయించుకోవాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తమన్ సూచించారు. ఇక తమన్ కు కరోనా అని తెలియగానే సినీ ప్రముఖులు, అభిమానులు త్వరగా కోలుకోవాలని ట్వీట్స్ చేస్తున్నారు. ఇక థమన్ సినిమాల విషయానికి వస్తే..ప్రస్తుతం స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ గా రాణిస్తున్నాడు. అగ్ర హీరోలంద‌రి సినిమాల‌కు వ‌ర్క్ చేస్తూనే మరికొన్ని సినిమాల‌కు బ్యాగ్రౌండ్ స్కోర్‌ను అందిస్తున్నారు.