అండమాన్ నికోబార్ దీవుల్లో భూకంపం

రిక్టర్ స్కేలుపై 5.2 తీవ్రత నమోదు

న్యూఢిల్లీ: కేంద్రపాలిత ప్రాంతం అండమాన్ నికోబార్ దీవుల్లో భూకంపం సంభవించింది. 5.2 తీవ్రతతో ఈ భూకంపం సంభవించింది. భూ ఉపరితలానికి 63 కిలోమీటర్ల లోతులో ఇది సంభవించింది. అండమాన్ నికోబార్ లోని క్యాంప్ బెల్ బేకి 246 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్ర స్థానం ఉందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ తెలిపింది.

అండమాన్ నికోబార్ దీవుల్లో తరచుగా భూకంపాలు వచ్చే అవకాశం ఉంది. గత సెప్టెంబర్ 22న కూడా అక్కడ భూకంపం సంభవించింది. అప్పుడు రిక్టర్ స్కేలుపై 3.9 తీవ్రత నమోదైంది. అంతకు ముందు సెప్టెంబర్ 11న 4.5 తీవ్రతతో భూకంపం సంభవించింది.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/international-news/