జగన్‌ ప్రభుత్వంపై మండిపడ్డా లోకేశ్‌

ప్రశ్నిస్తే చంపేస్తాడు నయా నియంత జగన్‌

అమరావతి: సిఎం జగన్‌ ప్రభుత్వంపై టిడిపి నేత నారా లోకేశ్‌ మండిపడ్డారు. స్థానిక ఎమ్మెల్యేని ప్రశ్నించిన వెంగయ్య అనే వ్య‌క్తిని చంపేశారంటూ లోకేశ్ ఆరోపించారు. ఇందుకు సంబంధించిన ఫొటోల‌ను ఆయ‌న పోస్ట్ చేశారు. ‘ప్రశ్నిస్తే చంపేస్తాడు నయా నియంత వైఎస్ జ‌గ‌న్. రూ.25 వేల కోట్ల లిక్కర్ మాఫియాని ఎండగట్టినందుకు చిత్తూరు జిల్లాలో ఆటో డ్రైవర్ ఓం ప్రతాప్ ని చంపేశారు. ఇప్పుడు ప్రకాశం జిల్లా, బెస్తవారపేట మండలం, శింగరపల్లె గ్రామంలో అభివృద్ధి పనులు ఎందుకు చేయడం లేదంటూ స్థానిక ఎమ్మెల్యేని ప్రశ్నించిన వెంగయ్యని చంపేశారు’ అని నారా లోకేశ్ పోస్ట్ చేశారు.

‘ఇవి ప్రభుత్వ హత్యలే. చెత్త పాలనని ప్రశ్నించిన వారిని చంపి ఆత్మహత్య చేసుకున్నారు అంటూ కేసు క్లోజ్ చెయ్యడం జగన్ రెడ్డి ఫ్యాక్షన్ రాజకీయానికి నిదర్శనం. వైఎస్‌ఆర్‌సిపి రౌడీ మూకలను ప్రజలు తరిమికొట్టే రోజులు దగ్గరపడ్డాయి’ అని నారా లోకేశ్ మండిపడ్డారు.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/