ఇక నేను ఉన్నానంటున్న లోకేష్ ..

ఎవరు ఏ ఆపదలో ఉన్న వారికీ నేనున్నాను అంటున్నాడు నారా లోకేష్. తెలుగు రాష్ట్రాల్లో తెలుగుదేశం పార్టీ ఏ పరిస్థితుల్లో ఉందొ చెప్పాల్సిన పనిలేదు. పల్లె , పట్టణం అనే తేడా లేకుండా ఎక్కడ కూడా టీడీపీ కనిపించకుండా పోయింది. ఈ క్రమంలో ఎలాగైనా మళ్లీ అధికారంలోకి రావాలని బాబు ప్రయత్నాలు మొదలుపెట్టారు. తెలంగాణ రాష్ట్రాన్ని పక్కన పెట్టి ఏపీలో పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు మాస్టర్ ప్లాన్ చేస్తున్నాడు. మొన్నటి వరకు నారా లోకేష్ ఎక్కువగా సోషల్ మీడియా కే పరిమితం అవుతూ వచ్చాడు. కానీ ఇప్పుడు లోకేష్ సైతం జనాల్లో తిరగడం మొదలుపెట్టారు.

ఇక రానున్న రెండు, మూడు నెలల్లో పార్టీ కార్యక్రమాలను మరింత వేగవంతం చేయడం, సంస్థాగతంగా పటిష్టం కావడంపై చంద్రబాబు, లోకేష్, అచ్చెంనాయుడు దృష్టి సారించారు. లోకేష్ ఇక ప్రజాసమస్యలపై రాష్ట్రవ్యాప్తంగా విస్తతంగా పర్యటించాలని నిర్ణయించారు. ఎక్కడ ఏ చిన్న సంఘటన జరిగినా అక్కడకు వెళ్లాలని, పార్టీ కార్యకర్తలకు, నాయకులకు ఎటువంటి ఆపద వచ్చినా వెళ్లి పరామర్శించడం, వారిని న్యాయపరంగా ఆదుకోవడం లాంటి అంశాలపై లోకేష్ దృష్టి సారించారు. ఇక చంద్రబాబు సైతం మొన్నటి వరకు కరోనా నేపథ్యంలో జూమ్ కే పరిమితం అయ్యారు. కానీ ఇప్పుడు కరోనా తీవ్రత తగ్గడం తో జిల్లాల నేతలను పిలిచి వారితో మాట్లాడుతున్నారు.