వార‌ణాసి వీధుల్లో అర్థరాత్రి పూట ప్ర‌ధాని తనిఖీలు

వారణాసి: ప్రధాని మోడీ సోమ‌వారం రాత్రి వార‌ణాసి వీధుల్లో న‌డుచుకుంటూ తిరిగారు. అర్థ‌రాత్రి 12.30 గంట‌ల‌కు ఆయ‌న సంత్ ర‌విదాస్ ఘాట్ నుంచి బ‌య‌లుదేరి గొదౌలియా కూడ‌లికి చేరుకున్నారు. అక్క‌డి నుంచి ప్ర‌ధాని మోడీ విశ్వ‌నాథ్ కారిడార్ చేరుకొని అక్క‌డ జ‌రుగుతున్న‌ నిర్మాణ ప‌నుల‌ను ప‌రిశీలించారు.

ఆ స‌మ‌యంలో ఉత్త‌ర్ ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి యోగి ఆదిత్య‌నాథ్ కూడా ఆయ‌న‌కు తోడుగా ఉన్నారు. దాదాపు 20 నిమిషాల‌పాటు ప్ర‌ధాని అక్క‌డే గ‌డిపారు. ఆ త‌రువాత రైలు మార్గాన త‌న గెస్ట్ హౌస్‌కు వెళ్లి విశ్రాంతి తీసుకున్నారు. ఈ మొత్తం త‌న‌ఖీకి సంబంధించిన వివ‌రాలు ప్ర‌ధాన మంత్రి ట్విట్ట‌ర్ ద్వారా షేర్ చేశారు. “కాశీలో అభివృద్ధి ప‌నులకు సంబంధించి త‌నిఖీ చేయ‌డం జరిగింది. కాశీ లాంటి ప‌విత్ర న‌గరానికి దేశంలోనే మెరుగైన ఇన్‌ఫ్రాస్ట్ర‌క్చ‌ర్ అందించేందుకు ప్రభుత్వం ప్ర‌య‌త్నం చేస్తోంది. ఈ పుణ్య‌క్షేత్రానికి వ‌చ్చే భ‌క్తులకు మెరుగైన సౌకర్యాలు అందించాలని రైల్వే క‌నెక్టివిటీ ప‌నులు వేగంగా జ‌రుగుతున్నాయి” అని ఆయ‌న త‌న ట్విట్ట‌ర్ అకౌంట్ ద్వారా తెలిపారు. ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ ప్ర‌స్తుతం రెండు రోజుల కాశీ సంద‌ర్శ‌నలో ఉన్నారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/