ఆకలిచావుల రూపంలో మరో ముప్పు
వరల్డ్ పుడ్ ప్రోగ్రామ్ ఛీఫ్ డేవిడ్ బిస్లే

న్యూయార్క్: కరోనా మహామ్మారి విజృంభణ ఇలాగే కొనసాగితే మరో మూడు నెలలో ఆకలి చావుల రూపంలో మరో విపత్తు సంభవిస్తుందని వరల్డ్ పుడ్ ప్రోగ్రామ్ చీఫ్ డేవిడ్ బిస్లే హెచ్చరించారు. కరోనా కారణంగా ప్రపంచ దేశాలు లాక్డౌన్ ను విధించడంతో దేశాలలో ప్రజలలో ఇళ్లనుంచి బయటకు వచ్చే పరిస్థితి లేదు. ఈ సమయంలో ఎంతో మంది ఆకలితో అలమటిస్తున్నారు. అలాంటి వారిని ఆదుకోకపోతే సుమారు మూడు కోట్ల వరకు ఆకలి చావులు సంభవించవచ్చాన్నారు. ఇప్పటికే పేద దేశాలు చితికి పోయాయి. అలాంటి వారకి సాయం చేయాలంటే ఐరాస తో కూడా నిధులు ఉండాలి. ఇలాంటి సమయంలో ప్రపంచ దేశాలు ఐరాసకు ఇచ్చే నిధుల్లో కోత విధించడం తగదని, అన్నారు. వరల్డ్ పుడ్ ప్రోగ్రామ్ తరపున సుమారు 10 కోట్ల మందికి ఆహరాన్ని అందిస్తున్నామని, అందులో 3 కోట్ల మంది కేవలం తామిచ్చే ఆహారంపై ఆధారపడ్డారని వీరికి సమయానికి ఆహరాన్ని అందించకుంటే చాలా నష్టం జరుగుతుందని చెప్పారు.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/