అట్టహాసంగా బ్రహ్మానందం రెండో కొడుకు నిశ్చితార్ధ వేడుక

హాస్య బ్రహ్మ బ్రహ్మానందం ఇంట పెళ్లి సందడి మొదలైంది. తన రెండో కొడుకు సిద్దార్థ్ నిశ్చితార్థం వేడుక ఆదివారం అట్టహాసంగా జరిగింది. బ్రహ్మానందంకు ఇద్దరు కొడుకులున్న సంగతి తెలిసిందే. పెద్ద కొడుకు గౌతమ్ హీరోగా కొన్ని సినిమాల్లో నటించాడు. గౌతమ్‌కు ఇది వరకే పెళ్లై పిల్లలు కూడా ఉన్నారు. అయితే బ్రహ్మీ చిన్న కొడుకు సిద్దార్థ్ విదేశాల్లో చదువుకొని అక్కడే ఉద్యోగం చేస్తుండటంతో అతని గురించి ప్రపంచానికి చాలా తక్కువ తెలుసు.

డాక్టర్ పద్మజా వినయ్ కుమార్తె ఐశ్వర్యతో సిద్దార్థ్‌ నిశ్చితార్ధం జరిగింది. సిద్దార్ధ్‌కు కాబోయే భార్య ఐశ్వర్య కూడా డాక్టరే కావడం విశేషం. ఈ వేడుకకు కమెడియన్ ఆలీ, రఘుబాబు, టి. సుబ్బిరామిరెడ్డి తదితరులు హాజరయ్యి నూతన జంటను ఆశీర్వదించారు. ఈ పెళ్లి పెద్దలు కుదిర్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వీరి నిశ్చితార్ధ వేడుకకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

ఇక బ్రహ్మానందం విషయానికి వస్తే.. ఇటీవల విడుదలైన రంగమార్తాండ మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.