బీట్‌రూట్‌తో కళ్లకు మెరుపు

కూరగాయలు-ఆరోగ్యం

Benefits of beetroot
Benefits of beetroot

‘కూరల్లోని కరివేపాకును పడేయొద్దు. అది కంటిచూపును బాగుచేస్తుంది. ఆకుకూరలు బాగా తింటే కళ్లద్దాలు రాకుండా ఉంటాయి. ఇలా పిల్లలకు మనం చెప్తూ ఉంటాం.

అయితే, ఆలాంటి ఆహారం పెద్దల కళ్లకూ ఆరోగ్యాని ఇస్తుందంటున్నా పరిశోధకులు. ఈ కూరగాయల్లో ఉండే నైట్రేట్స్‌..మాక్యులర్‌ డీజనరేషన్‌ సమస్యను నివారిస్తాయని చెబుతున్నారు.

వయసు పెరిగిన కొద్దీ కనిపించే సమస్యల్లో మాక్యులర్‌ డిజనరేషన్‌ ఒకటి కంటిలోని మాక్యులా భాగంఓ సమస్య ఏౖ ్తడటం వల్ల కంటిచూపు దెబ్బతింటుంది.

అయిదు పదుల వయసులో కనిపించే దృష్టి సమస్యలకు కూడా మాక్యులర్‌ డీజనరేషనే కారణం. దీన్ని నివారించాలంటే పెద్దవాళ్లు కూడా ఆకుకూరలతోపాటు బీట్‌రూట్‌ను తరచుగా తీసుకోవాలని సూచిస్తున్నారు పరిశోధకులు.

వంద గ్రాముల పాలకూరలో 20 మిల్లీ గ్రాము వైట్రేట్‌ ఉంటే అదే పరిమానంలోని బీట్‌రూట్‌లో వంద మిల్లీగ్రాముల వరకూ ఉంటుంది.

అందుకే బీట్‌రూట్‌ కూడా కంటి ఆరోగ్యానికి సమాయనడుతుందని బల్లగుద్ది చెప్తున్నారు.

తాజా సినిమా వార్తల కోసం: https://www.vaartha.com/news/movies/