మేడిగడ్డ బ్యారేజీ 77 గేట్లు ఎత్తివేత

జయశంకర్ భూపాలపల్లి: కాళేశ్వరం ప్రాజెక్ట్ లోని మేడిగడ్డ బ్యారేజీ వద్ద అధికారులు 77 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. మేడిగడ్డ బ్యారేజ్ ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 7,43,350 క్యూసెక్కులుగా కొనసాగుతుంది. బ్యారేజీ పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 16.17 టీఎంసీలగా ఉండగా, ప్రస్తుత నీటిమట్టం 5.327 టీఎంసీలుగా ఉంది.


మరొవైపు..అన్నారం (సర్వతి) బ్యారేజీ 60 గేట్లు ఎత్తి అధికారులు నీటిని దిగువకు విడుదల చేశారు. అన్నారం ఇన్ ఫ్లో 1,69,472 క్యూసెక్కులుగా ఉండగా, ఔట్ ఫ్లో 1,99,126గా క్యూసెక్కులుగా కొనసాగుతుంది. బ్యారేజీ పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 10.87 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 10.28 టీఎంసీలుగా ఉంది.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/andhra-pradesh/