కాల్వలోకి దూసుకెళ్లి కారు..ముగ్గురి మృతి

డ్రైవర్ నిద్రమత్తే కారణమని ప్రాథమిక నిర్ధారణ

Accident
Accident

పోడూరు: ఈరోజు తెల్లవారుజామున పశ్చిమ గోదావరి జిల్లా పోడూరు మండలంలో ఘోర ప్రమాదం జరిగింది. జగన్నాథపురం వద్ద ఓ కారు అదుపుతప్పి కాల్వలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. యలమంచిలి మండలం కాజ గ్రామానికి చెందిన బాధితులు నరసాపురం మండలంలోని మచ్చపురి నుంచి రాజమహేంద్రవరం వెళ్తుండగా కారు అదుపుతప్పి నరసాపురం కాల్వలోకి దూసుకెళ్లింది. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు స్థానికుల సాయంతో కారును బయటికి తీశారు. డ్రైవర్ నిద్రమత్తే ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా నిర్ధారించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

తాజా ఇపేపరు వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://epaper.vaartha.com/