హోమ్‌ లోన్‌ తీసుకునే వారికి ఎల్‌ఐసీ శుభవార్త

భారీగా తగ్గించిన వడ్డీ రేట్లు

LIC
LIC

హైదరాబాద్‌: హోమ్ లోన్ తీసుకోవాలనుకునేవారికి ఎల్‌ఐసీ శుభవార్త తెలిపింది. వడ్డీ రేట్లను భారీగా తగ్గించింది. ఎల్ఐసీహెచ్ఎఫ్ఎల్ భారతదేశంలో అతిపెద్ద బీమా సంస్థ అయిన లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలి -LIC అనుబంధ సంస్థ. ఇళ్ల రుణాలను ఇచ్చే అతిపెద్ద సంస్థ కూడా. సిబిల్ స్కోర్ 800 పైన ఉన్న కొత్త కస్టమర్లకు 7.50 శాతానికే హోమ్ లోన్ ఇస్తామని ప్రకటించింది. గతంలో ఈ వడ్డీ రేటు 8.10 శాతం ఉండేది. అంటే హోమ్‌లోన్‌పై వడ్డీ రేటును ఏకంగా 60 బేసిస్ పాయింట్స్ తగ్గించింది. అంతేకాదు ఎల్‌ఐసీ హౌజింగ్ ఫైనాన్స్ దగ్గర తీసుకునే రుణానికి సమానంగా సింగిల్ ప్రీమియం టర్మ్ అష్యూరెన్స్ పాలసీ తీసుకునే కస్టమర్లకు మరో 10 బేసిస్ పాయింట్స్ తక్కువకే హోమ్ లోన్ ఇస్తామని ప్రకటించింది. అంటే 7.40 శాతానికే హోమ్ లోన్ తీసుకోవచ్చు. ఇప్పటికే హోమ్ లోన్ తీసుకున్నవారికి కూడా ఈ తగ్గింపు వర్తిస్తుంది.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/