ధోనిపై ప్రశంశలు కురిపించిన మైక్‌ హస్సీ

అతనిలో నమ్మశక్యం కాని శక్తి ఉంది

micheal hussey, dhoni
micheal hussey, dhoni

సిడ్నీ: ఆస్ట్రేలియా మాజి బ్యాట్స్‌మన్‌ మైక్‌ హస్సి, చైన్నై సూపర్‌ కింగ్స్‌ కెప్టెన్‌ మహేంద్రసింగ్‌ ధోని పై ప్రశంశల వర్షం కురించాడు. తాజా గా చెన్నై జట్టుతో ఇన్‌స్టాగ్రామ్‌ లైవ్‌లో మాట్లాడిన హస్సీ ధోని గురించి పలు ఆసక్తికర విషయాలు తెలిపాడు. మ్యాచ్‌ ఆడేటపుడు నేను త్వరగా ముగించాలనుకుంటాను, కాని ధోని మాత్రం చాలా లెక్కలేసుకుంటాడు, మహి మాత్రం తరువాత ఏ బౌలర్‌ వస్తాడో చూద్దాం .. ఆ బౌలర్‌ బౌళింగ్‌లో పరుగులు చేయవచ్చు అంటాడు. రిస్క్‌ లేకుండా మ్యాచ్‌ను ముగించేద్దాం అన్నట్లుగా ఉంటాడు. అని చెప్పాడు.అంతేకాకుండా అతనిలో నమ్మశక్యం కాని శక్తి ఉంది. ఏ స్థితిలో అయిన సహనం కోల్పోడు. ముందు ప్రత్యర్ధినే తడబడలేలా చేస్తాడు. ఏ సమయంలోనైనా బంతిని బౌండరి దాటించగలడు. నాకైతే నాపై అంత నమ్మకం లేదు. తనెంత ప్రశాంతంగా ఉంటే బౌలర్‌ అంత ఒత్తిడికి గురి అవుతాడు అని భావిస్తాడు. క్రికెట్‌ ప్రపంచంలో ఇప్పటిదాకా ధోని లాంటి ఫినిషర్‌ కనిపించలేదు అని హస్సీ అన్నాడు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/international-news/