మహీంద్రా ఎలక్ట్రిక్‌ ఈకేయువీ 100 కారు మార్కెట్లోకి

ఈకేయువీ 100 ప్రారంభ ధర రూ.8.25 లక్షలు

mahindra-ekuv100-launched
mahindra-ekuv100-launched

ఢిల్లీ: భారతీయ వాహన తయారీ సంస్థ మహీంద్రా విద్యుత్‌తో నడిచే ఈకేయువీ100 కారును మార్కెట్లోకి విడుదల చేసింది. ఢిల్లీలో జరుగుతున్న ఆటో ఎక్స్‌పో-2020లో మహీంద్రా ఈ వాహనాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈకేయువీ 100 ప్రారంభ ధరను రూ.8.25 లక్షలుగా సంస్థ నిర్ణయించింది. ఇప్పటి వరకు మార్కెట్లో ఉన్న విద్యుత్‌ కార్లతో పోలిస్తే ఈ కారు సరమైన ధరకు లభించనుంది. మహీంద్రా ఈకేయువీ 100లో 40కిలోవాట్‌ ఎలక్ట్రిక్‌ మోటారును అమర్చారు. ఇది 53బీహెచ్‌పీ శక్తిని, 120 ఎన్‌ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇందులోని సింగిల్‌ స్పీడ్‌ ట్రాన్స్‌మిషన్‌ కారు ముందు చక్రాలకు శక్తిని అందిస్తుంది. అలానే ఈకేయువీ 100లో 15.9 కిలోవాట్‌ లిథియం అయాన్‌ బ్యాటరీని అమర్చారు. ఇది ఒక్కసారి ఛార్జింగ్‌ చేస్తే 120 కిలోమీటర్లు పైగా ప్రయాణిస్తుందని సంస్థ తెలిపింది. కేవలం నిమిషాల్లో 0-80 శాతం ఛార్జింగ్‌ అవుతుంది.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/