భూటాన్‌లో భూప్రకంనలు

Richter scale graph
Earthquake

థింపూ: భూటాన్‌ రాజధాని థింపూలో శుక్రవారం రాత్రి 10 గంటల సమయంలో భూప్రకంపనలు చోటు చేసుకున్నాయి. రిక్టర్‌ స్కేలుపై ప్రకంపనల తీవ్రత 3.7గా నమోదైనట్లు జాతీయ భూకంప అధ్యయన కేంద్రం (ఎన్‌సీఎస్‌) తెలిపింది. థింపూనకు దక్షిణంగా 82 కిలోమీటర్ల దూరంలో నైరుతిదిశగా భూకంపం సంభవించినట్లు ఎన్‌సీఎస్‌ పేర్కొంది. ఒక్కసారిగా భూమి కంపించడంతో భయాందోళనతో జనాలు ఇండ్ల నుంచి బయటకు వచ్చారు. భూ ప్రకంపనల కారణంగా ఎలాంటి ప్రాణ, ఆస్తినష్టం సంభవించలేదని అధికారులు తెలిపారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/