సింగపూర్‌ నూతన ప్రధానిగా లారెన్స్‌ వాంగ్‌

Lawrence Wong Sworn In As Singapore’s New Prime

సింగపూర్‌ః సింగపూర్ కొత్త ప్రధానిగా లారెన్స్ వాంగ్ (51) ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమాన్ని టెలివిజన్‌లో ప్రత్యక్ష ప్రసారం చేశారు. రెండు దశాబ్దాల పాటు ప్రధానిపదవి నిర్వహించి రాజీనామా చేసిన లీ సీన్ లూంగ్ స్థానంలో లారెన్స్ వాంగ్ బాధ్యతలు స్వీకరించారు. పూర్వపు ఉప ప్రధాని అయిన వాంగ్ బుధవారం (స్థానిక కాలమానం ప్రకారం) రాత్రి 8 గంటల తరువాత ఇస్తానా ప్రభుత్వ కార్యాలయంలో ప్రధానిగా ప్రమాణం చేశారు.

కాగా, వాంగ్‌ ప్రధాని పదవితోపాటు ఆర్థిక మంత్రి పదవిని కూడా నిర్వహిస్తారు. దేశాధ్యక్షుడు ధర్మన్‌ షణ్ముగరత్నం (67) వాంగ్‌తో ప్రధానిగా ప్రమాణస్వీకారం చేయించారు. అయితే లూంగ్‌ ప్రభుత్వంలోని మంత్రులు అందరూ వాంగ్‌ సర్కారులోనూ అవే పదవులను చేపట్టనున్నారు. 2025 నవంబర్‌లో సింగపూర్‌ పార్లమెంటు ఎన్నికలు జరిగిన తరువాతే మంత్రివర్గంలో మార్పులు చేయనున్నారు.