వైఎస్సార్ బీమా పథకానికి శ్రీకారం

12,039 మంది కుటుంబాలకు బీమా క్లైయిమ్ కు సమానమైన రూ. 254
కోట్ల జమ

CM YS Jaganmohan Reddy launches YSR insurance plan online
CM YS Jaganmohan Reddy launches YSR insurance plan online

Amaravati: కుటుంబంలో సంపాదించే వ్యక్తి అనుకోని పరిస్థితులతో మరణిస్తే ఆ వ్యక్తి కుటుంబానికి మానవత్వం ఉన్న ప్రభుత్వంగా తోడుగా నిలబడాలనే దృక్పధంతో వైఎస్సార్ బీమా పధకానికి శ్రీకారం చుట్టామని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పేర్కొన్నారు.   బుధవారం తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుండి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వైయస్సార్ బీమా పథకం కింద అర్హులై ఉండి బ్యాంకుల్లో ఎన్‌రోల్ కాకుండా మిగిలి, దురదృష్టవశాత్తూ మరణించిన 12,039 మంది కుటుంబాలను మానవతాదృక్పధంతో బీమా క్లైయిమ్ కు సమానమైన రూ. 254
కోట్లను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆన్ లైన్ లో లబ్దిదారుల ఖాతాలకు జమ చేశారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ బీమా అన్నది ఎంత ముఖ్యమో, ఎంత అవసరమో ప్రత్యేకంగా కుటుంబంలో
సంపాదించే వ్యక్తికి హఠాత్తుగా ఏదైనా జరిగినప్పుడు, ఆ కుటుంబం తల్లడిల్లిపోయే పరిస్ధితి వచ్చినప్పుడు, ఆ కుటుంబానికి మనిషిని తిరిగి తీసుకురాలేక పోయినప్పటికీ  మానవత్వం ఉన్న ప్రభుత్వంగా కనీసం ఆ కుటుంబ అవసరాలకు, ఆ కుటుంబం ఇబ్బందులు పడకుండా ఉండే ఏ కార్యక్రమం చేయగలిగినా కూడా మంచిదే అని
తెలిపారు.  

వైయస్సార్‌ బీమా పథకానికి అర్హులై ఉండి కూడా బ్యాంకుల్లో ఎన్‌రోల్‌మెంట్‌ కాకుండా మిగిలిపోయి ఉన్న పరిస్ధితుల మధ్య అంటే అర్హత ఉండి కూడా బ్యాంకులు వాళ్లను ఎన్‌రోల్‌ చేయని కారణంగా
గవర్నమెంట్‌ బ్యాంకులకు ప్రీమియం డబ్బును కట్టేసిన తర్వాత కూడా బ్యాంకుల్లో ఎన్‌రోల్‌ కాకుండా మిగిలిపోయి ఉన్న నేపధ్యంలో  దురదృష్ణవశాత్తూ మరణించిన 12,039  మందికి చెందిన కుటుంబాలను ఈ రోజు మానవతాదృక్ఫధంతో ఈ రోజు ఆ  క్లైయిమ్ లను రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తుందన్నారు.  

కేంద్ర సహాయం ఒక్క రూపాయి కూడా లేకపోయినా కూడా  మానవతా దృక్పథంతో దేశంలో ఎక్కడా లేని విధంగా పూర్తి బీమా కయ్యే
మొత్తం ఖర్చంతా కూడా మనందరి ప్రభుత్వమే భరించడానికి సిద్ధపడి బ్యాంకులకు ప్రీమియం కట్టడం
జరిగిందన్నారు.

ఈ బీమా ప్రీమియం మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తూ గతేడాది అక్టోబరు 21న బ్యాంకులకు
ప్రీమియం సొమ్ము దాదాపు రూ.510 కోట్లు పూర్తిగా చెల్లించిందన్నారు. అర్హత ఉండి కూడా మిగిలిపోయి ఉంటే
ట్రోల్‌ ఫ్రీ నెంబర్‌ 155214 కు ఫోన్ చేసి సంకోచం లేకుండా రిజిష్టర్‌ చేసుకోవాలన్నారు. మరణించిన కుటుంబాల
వ్యక్తులకు మంచి జరగాలని, దేవుడు దయ ఆ కుటుంబాల మీద ఉండాలని, మంచి జరగాలని మనసారా
కోరుకుంటున్నామన్నారు. అనంతరం ముఖ్యమంత్రి కంప్యూటర్‌లో బటన్‌ నొక్కి  వైయస్సార్‌ బీమాపరిహారాన్ని
విడుదల చేశారు. 

తాజా క్రీడా వార్తల కోసం: https://www.vaartha.com/news/movies/