కాకినాడ కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత..విద్యార్థులు, పోలీసుల మధ్య తోపులాట

కాకినాడలోని కలెక్టరేట్ వద్ద ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. ప్రైవేటీకరణ జరిగిపోయిందని.. ఎయిడెడ్ కొనసాగించాలని డిమాండ్ చేస్తూ గేటు ముందు బైఠాయించి ధర్నా నిర్వహించారు. వందలాది మంది విద్యార్థులు ఆందోళనలో పాల్గొన్నారు. ఈ క్రమంలో బారికేడ్లు, కలెక్టరేట్ గేటును తోసుకుంటూ లోపలికెళ్లేందుకు విద్యార్థులు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలోనే విద్యార్థులు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది.

దీంతో పోలీసులు విద్యార్థులపై లాఠీచార్జీ చేశారు. లోపలకి ప్రవేశించిన విద్యార్థులను బయటకు పంపించి.. మెయిన్ గేట్ మూసివేశారు. కొంతమంది విద్యార్థి సంఘాల నాయకులను బలవంతంగా తీసుకువచ్చి వ్యాన్‌లో ఎక్కించారు. తమ ప్రైవేటీకరణ చేయడానికి వీల్లేదంటూ వారు నినాదాలు చేశారు. వర్షం పడుతున్నా లెక్క చేయకుండా.. ప్రభుత్వానికి, పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళన చేశారు. అనంతరం జిల్లా రెవెన్యూ అధికారి సీహెచ్‌ సత్తిబాబు విద్యార్థులతో మాట్లాడారు. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని ఆయన హామీ ఇచ్చారు. దీంతో విద్యార్థులు ఆందోళన విరమించారు.